SSMB 29 సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో హైప్

మన పత్రిక, వెబ్​డెస్క్ సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), విజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB 29 ప్రపంచవ్యాప్తంగా అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే భారత్‌లో రెండు షెడ్యూల్‌లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం కెన్యాలో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా, దర్శకుడు రాజమౌళి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాదితో భేటీ కావడం ఈ సినిమాకు అంతర్జాతీయంగా హైప్ పెంచింది. ఈ సమావేశం ఫోటోలను ముదావాది … Read more

కోనసీమ జిల్లాలో డీజే సౌండ్‌కి ఒకరు బలి..

మన పత్రిక, వెబ్​డెస్క్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ(Konaseema) జిల్లాలోని చిన్నగాడవిల్లి గ్రామంలో గణపతి నిమజ్జనం సందర్భంగా విషాదం నెలకొంది. డీజే సౌండ్‌కు(DJ Sound) డ్యాన్స్ చేస్తూ గుత్తుల ప్రసాద్ (37) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఊహించని ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిమజ్జనం సందర్భంగా ఈ ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

పవన్ కళ్యాణ్ అరకులో పర్యటన

మన పత్రిక, వెబ్​డెస్క్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఈ నెల 5న అరకులోని మాడగడ గిరిజన గ్రామంలో పర్యటించనున్నారు. జనసేన పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో ఆయన గిరిజనుల సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’లో పాల్గొంటారు. ఈ ఉత్సవం 12 రోజుల పాటు కొనసాగుతుంది. గత నెల 25న ప్రారంభమైంది. గిరిజనుల ప్రత్యేక ఆహ్వానం మేరకు చివరి రోజున పవన్ కళ్యాణ్ హాజరవుతారు.మాడగడ గ్రామం … Read more

తల్లికి వందనం: ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్ వినుకొండ: తల్లికి వందనం పథకం ( Thalliki Vandanam ) కింద డబ్బులు అందని వారి ఫిర్యాదులపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీరియస్ అయ్యారు. సోమవారం సిద్ధార్థ నగర్ లో పర్యటించిన సమయంలో పలువురు మహిళలు తమకు నిధులు రాలేదని జీవికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీవి, మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. సర్వే పూర్తిగా ఎందుకు చేయలేదని నిలదీశారు. మళ్లీ ఇలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. … Read more

ఆఫ్ఘనిస్థాన్‌లో పెరుగుతోన్న మృతుల సంఖ్య

మన పత్రిక, వెబ్ డెస్క్ : తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో (Afghanistan) మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Earthquake) కారణంగా ఇప్పటివరకు 800 మందికి పైగా మరణించగా, 2,000 మందికి పైగా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి వేళ సంభవించిన ఈ భూకంప కేంద్రం జలాలాబాద్‌ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈదురుగాలులకు తట్టుకోలేని … Read more

నేడు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..

మన పత్రిక, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేడు వివిధ సమీక్షా సమావేశాలు, ఒక సదస్సులో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు క్యాంపు కార్యాలయంలో హార్టికల్చర్(Horticulture), మార్కెటింగ్ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 11.40 గంటలకు సీఆర్డీఏపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 01.55 గంటలకు విశాఖపట్నం వెళ్లనున్న ముఖ్యమంత్రి, 2 గంటలకు నొవాటెల్‌లో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 05.45 … Read more

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్..

మన పత్రిక, వెబ్ డెస్క్ : ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్(Orange alert) జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, యన్.టి.ఆర్, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ … Read more

Andhra News: వైసీపీ యూరియా కొరతపై ఆందోళనలు

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరతపై స్పందిస్తూ వైసీపీ ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు నిరసనలు నిర్వహించి, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా సరఫరా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు కారణం టీడీపీ నేతలు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యూరియాను బ్లాక్ … Read more

పాఠశాలలకు వరుసగా 3 రోజులు సెలవులు!

మన పత్రిక, వెబ్​డెస్క్ ఈ వారం పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5, శుక్రవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. సెప్టెంబర్ 6, శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో సెలవు ఉండనుంది. ఏపీలో ఈ రోజు సెలవు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. సెప్టెంబర్ 7, ఆదివారం వారంవారీ సెలవు రానుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు లభిస్తోంది. … Read more

Andhra News: వినాయక చవితి ఉత్సవంలో వివాదం: రెండు వర్గాల ఘర్షణ

మన పత్రిక, వెబ్​డెస్క్ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారిపాలెంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఓ వర్గం ఎన్టీఆర్ బొమ్మతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీపై ‘కపాలాలు పగులుతాయి’ అనే పదాలు రాయడంతో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చిచ్చు రేగి ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాదనలు దారుణమైన స్థాయికి చేరుకోవడంతో ఇరుపక్షాల మధ్య … Read more