మన పత్రిక, వెబ్ డెస్క్ : తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో (Afghanistan) మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Earthquake) కారణంగా ఇప్పటివరకు 800 మందికి పైగా మరణించగా, 2,000 మందికి పైగా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి వేళ సంభవించిన ఈ భూకంప కేంద్రం జలాలాబాద్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈదురుగాలులకు తట్టుకోలేని మట్టి, రాళ్లతో నిర్మించిన ఇళ్లు పెద్ద సంఖ్యలో కూలిపోయాయి.
భూకంప ప్రభావం 400 కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు కూడా కనిపించింది. కొండచరియలు విరిగిపడడం వల్ల రోడ్లు మూసుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఫోన్ సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రక్షించి, హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
