మన పత్రిక, వెబ్‌డెస్క్
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారిపాలెంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఓ వర్గం ఎన్టీఆర్ బొమ్మతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీపై ‘కపాలాలు పగులుతాయి’ అనే పదాలు రాయడంతో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చిచ్చు రేగి ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Advertisement
వాదనలు దారుణమైన స్థాయికి చేరుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
