మన పత్రిక, వెబ్డెస్క్
ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరతపై స్పందిస్తూ వైసీపీ ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు నిరసనలు నిర్వహించి, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా సరఫరా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఈ సమస్యకు కారణం టీడీపీ నేతలు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యూరియాను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నారని, దీని వల్ల రైతులు నష్టపోతున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో పంట సాగుకు సంబంధించిన సమయంలో యూరియా కొరత ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుందని పార్టీ హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
