మన పత్రిక, వెబ్‌డెస్క్
సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), విజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB 29 ప్రపంచవ్యాప్తంగా అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే భారత్‌లో రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం కెన్యాలో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా, దర్శకుడు రాజమౌళి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాదితో భేటీ కావడం ఈ సినిమాకు అంతర్జాతీయంగా హైప్ పెంచింది. ఈ సమావేశం ఫోటోలను ముదావాది తన అధికారిక సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తన దేశమైన కెన్యా షూటింగ్‌కు ఎంపిక కావడం గర్వకారణమని, ఈ సినిమా తమ దేశ చరిత్రను ప్రపంచానికి చూపించగలదని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో మసాయి మారా, నైవాషా, అంబోసెలి వంటి ప్రదేశాలు ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. నవంబర్ 2025లో సినిమా నుండి ఫస్ట్ అప్డేట్ రానుంది. ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచనుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
