బ్రెయిన్ ట్యూమర్ పై పరిశోధన.. మిట్స్ అధ్యాపకురాలికి డాక్టరేట్

మన పత్రిక వెబ్​డెస్క్, మదనపల్లె: వైద్య రంగంలో సాంకేతికత వినియోగంపై చేసిన పరిశోధనకు గాను మదనపల్లె మిట్స్ (MITS) డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. పుగళరసికి డాక్టరేట్ వరించింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఆమెకు ఈ పట్టా లభించినట్లు మిట్స్ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ వెల్లడించారు. ‘కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్, ఎవల్యూషనరీ ఆల్గోరిథం’ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడం, వర్గీకరించడం అనే అంశంపై ఆమె ఈ పరిశోధన … Read more

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల: మే 18న పరీక్ష.. ఫిబ్రవరి 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: న్యాయవాద వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ (TG LAWCET – 2026) నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పీజీ కోర్సులో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు … Read more

TG TET Results 2026 : వచ్చే వారమే రిలీజ్.. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) రాసిన లక్షలాది మంది అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు ముగిసి ప్రాథమిక ‘కీ’ కూడా విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు తుది ఫలితాలపైనే ఉంది. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అంటే వచ్చే వారంలోనే అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఈసారి గతంతో పోల్చితే … Read more

మున్సిపల్ పోరు: మీ వార్డు అభ్యర్థి ఎవరు? ఆస్తులెంత? నేరచరిత్ర ఉందా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. నామినేషన్ల ఘట్టం ముగిసి, ఉపసంహరణల పర్వం కూడా పూర్తికావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోగా, ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) ఓటర్లకు కీలక సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి, బరిలో ఉన్న అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, … Read more

నిజామాబాద్‌కు రూ.600 కోట్ల స్కూళ్లు: సీఎం రేవంత్ శంకుస్థాపన..

మన పత్రిక వెబ్​డెస్క్, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. “ప్రజాపాలన – ప్రగతిబాట” కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ. 200 కోట్ల చొప్పున, మొత్తం రూ. 600 కోట్లతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ … Read more

హైదరాబాద్‌ను ‘గ్లోబల్ ఫిల్మ్ హబ్’గా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ … Read more

Veldanda: నూతన సీఐగా రఘువీర్ రెడ్డి.. బాధ్యతల స్వీకరణ

మన పత్రిక వెబ్​డెస్క్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రఘువీర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తించిన విష్ణువర్ధన్ రెడ్డికి మల్టీ జోన్ 2 ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లాలో పనిచేసి బదిలీపై వచ్చిన రఘువీర్ రెడ్డి నూతన సీఐగా చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో … Read more

KTR: సిట్ విచారణకు కేటీఆర్ తప్పు చేయలేదు.. రేవంత్ రెడ్డిని, ఆ పోలీసులను వదిలిపెట్టం!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. అంతకంటే ముందు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తామని, తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశామే తప్ప, ఎప్పుడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదని, ప్రత్యర్థుల … Read more

Rythu Bharosa : రైతు భరోసా లేట్‌..? సర్కార్ కొత్త నిర్ణయం ఇదే..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి నాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి పండుగకే ఈ నిధులు తమ ఖాతాల్లో జమవుతాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూశారు. కానీ, పండుగ వెళ్లిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం నిధుల విడుదలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ జాప్యం జరుగుతోంది. ఇదిలా … Read more

చీపురు పట్టిన ఎమ్మెల్యే..

మన పత్రిక వెబ్​డెస్క్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సెంటర్‌లో శుక్రవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిత్యంలాగే పరిసరాల పరిశుభ్రతలో భాగంగా వీధులను శుభ్రం చేస్తుండగా, అటుగా వచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా వారితో కలిసిపోయారు. కారు దిగిన ఆయన నేరుగా చేతిలోకి చీపురు తీసుకుని రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగిస్తూ శుభ్రత పనుల్లో భాగస్వాములయ్యారు. ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి … Read more