మన పత్రిక వెబ్డెస్క్, మదనపల్లె: వైద్య రంగంలో సాంకేతికత వినియోగంపై చేసిన పరిశోధనకు గాను మదనపల్లె మిట్స్ (MITS) డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. పుగళరసికి డాక్టరేట్ వరించింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఆమెకు ఈ పట్టా లభించినట్లు మిట్స్ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ వెల్లడించారు.
‘కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్, ఎవల్యూషనరీ ఆల్గోరిథం’ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడం, వర్గీకరించడం అనే అంశంపై ఆమె ఈ పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా మిట్స్ ఛాన్సలర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, విభాగాధిపతులు పుగళరసిని ప్రత్యేకంగా అభినందించారు.
ఆమె పరిశోధన భవిష్యత్తులో వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
