SSC Student Suicide : మార్కులు తక్కువగా వచ్చాయని పేరెంట్స్ తిట్టారని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

ssc student commits suicide in habsiguda hyd

SSC Student Suicide : పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడ పరిధిలో చోటు చేసుకుంది. తనకు మార్కులు తక్కువగా వచ్చాయని తన పేరెంట్స్ మందలించారని మనస్థాపం చెందిన ఆ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking … Read more

TS High Court : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో నేడే విచారణ

high court hearing today on local body elections

TS High Court : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినేట్ సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ కూడా రెండు మూడు రోజుల్లో విడుదల కానుంది. Mana Patrika … Read more

TG CABINET: నేడు కేబినెట్ సమావేశం…

Telangana cabinet meeting Today 25 november

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన నేడు మంత్రి మండలి సమావేశం జరగనుంది(Telangana cabinet meeting Today). ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలు ఈ అజెండాలో ఉండనున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల తుది రూపురేఖలు, అలాగే రైజింగ్ తెలంగాణ 2047 పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని … Read more

Revanth Reddy Kodangal Tour : ఢిల్లీలో నోయిడా.. తెలంగాణలో కొడంగల్

telangana cm revanth reddy kodangal tour

Revanth Reddy Kodangal Tour : ఢిల్లీ పక్కన ఉన్న నోయిడా ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో.. తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అలా తీర్చిదిద్దుతానని.. తెలంగాణ నోయిడాగా కొడంగల్ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొడంగల్ పట్టణంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి రేవంత్ భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం … Read more

Ibomma Ravi : ‘మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం’ అని మెసేజ్ పెట్టి దొరికిపోయాడు

how ibomma ravi caught by police

Ibomma Ravi : మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం.. అని ఐబొమ్మ రవి తన ఫ్రెండ్ కు మెసేజ్ పెట్టి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని తెలుసుకున్న పోలీసులు అతడిని కూకట్ పల్లిలోని తన ఇంట్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ వచ్చానని తన ఫ్రెండ్ కు చేసిన మెసేజ్ తో పోలీసులు రవి హైదరాబాద్ వచ్చినట్టుగా నిర్ధారించుకున్నారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు హైదరాబాద్ … Read more

Car Fire Accident : ఓఆర్ఆర్‌పై కారు దగ్ధం.. డ్రైవర్ సజీవ దహనం

car fire accident in orr hyderabad

Car Fire Accident : హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారులో సడెన్ గా మంటలు రావడంతో క్షణాల్లో కారు దగ్ధమైంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన శామీర్ పేట్ సమయంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకునే అవకాశం లేక డ్రైవర్ కారులోనే సజీవదహనం అయ్యాడు. Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more

Rythu Bharosa: రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

telangana rythu bharosa

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో యాసంగి సీజన్‌కు సంబంధించి ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ. 12,000 చొప్పున అందిస్తుండగా, ఇప్పటికే వానాకాలం సీజన్‌కు సంబంధించిన రూ. 6,000 జమ అయ్యాయి. ఇటీవల తుఫాను, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు, యాసంగి సాగు పెట్టుబడి కోసం ఇప్పుడు ప్రభుత్వ సాయం వైపు చూస్తున్నారు. రానున్న … Read more

Palle Velugu Bus Accident : మరో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

another bus accident in uppal hyderabad

Palle Velugu Bus Accident : మరో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటు చేసుకుంది. ఉప్పల్ వద్ద అదుపు తప్పిన పల్లె వెలుగు బస్సు మెట్రో పిల్లర్ వైపు దూసుకెళ్లింది. యాదగిరిగుట్ట నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ 102 వద్ద అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టబోయింది. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ … Read more

Madhavaram Krishnarao : ‘కేసీఆర్ పులి బయటికి వస్తే కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటది’

brs mla Madhavaram krishnarao on kcr

Madhavaram Krishnarao : ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన ఎవరికీ భయపడరన్నారు. కేసీఆర్ పులి బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటుందన్నారు. పులి బయటికి వచ్చినప్పుడు చెప్తాం వీళ్ల సంగతి. పులిని బయటికి రమ్మంటున్నరు కదా. మీ పాపాలు పండాలని పులి అట్లనే ఉన్నది. మీ పాపాలు పండిన నాడు అప్పుడు పులి బయటికి వచ్చినప్పుడు మీ సంగతి … Read more

Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్

cyber criminals hacked Telangana ministers WhatsApp groups

Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్‌బీఐ బ్యాంక్ ఆధార్ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను వాట్సప్ గ్రూపులలో సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటూ ఎస్‌బీఐ పేరుతో మెసేజ్‌లు పంపించారు. వాటిపై క్లిక్ చేయగానే ఆయా వాట్సప్ గ్రూప్‌లన్నీ హ్యాక్ అయిపోయాయి. Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more