Ibomma Ravi : మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం.. అని ఐబొమ్మ రవి తన ఫ్రెండ్ కు మెసేజ్ పెట్టి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని తెలుసుకున్న పోలీసులు అతడిని కూకట్ పల్లిలోని తన ఇంట్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ వచ్చానని తన ఫ్రెండ్ కు చేసిన మెసేజ్ తో పోలీసులు రవి హైదరాబాద్ వచ్చినట్టుగా నిర్ధారించుకున్నారు.
తాను విదేశాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేవాడని.. అప్పుడు ఒక్క ఫ్రెండ్ ని మాత్రం కలిసి అతడితో పార్టీ చేసుకునే వాడని పోలీసులు గుర్తించారు. రవి ఫ్రెండ్ తో మాట్లాడిన పోలీసులు.. అతడు హైదరాబాద్ వస్తే చెప్పాలని ముందే ఆదేశించారు. రవి ఫ్రెండ్ ఫోన్ ను కూడా ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. రవి తన ఫ్రెండ్ కు మెసేజ్ చేయడంతో పక్కా ప్రణాళికతో స్కెచ్ వేసి రవిని పోలీసులు పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
