పాల్వంచ కుర్రాడు చిన్నుకు సినిమా హీరోగా ఘన స్వాగతం

మన పత్రిక, వెబ్​డెస్క్ Palwancha news : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( Kothagudem ) పాల్వంచ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన లవ్ యు రా సినిమా హీరో చిన్ను (సాయి కృష్ణ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వనమా కాలనీకి చెందిన చిన్ను పాల్వంచ పేక్షకులు అభిమా నులు ప్రజానీకం చాలా చక్కగా ఆదరించి మార్నింగ్ షో థార్ థియేటర్ పాల్వంచ లో అభిమానులు పేక్షకులు ఆదరించారు ఈరోజు చిన్ని … Read more

అన్నదానం పవిత్రం, వినాయకుడికి ఇష్టం: కొత్వాల శ్రీనివాసరావు సందేశం

అన్నదానం ఎంతో పవిత్రమైనది – వినాయకునికి ఎంతో ఇష్టమైనది— రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల అన్నదానం ఎంతో పవిత్రమైనదని, ఆదిదేవుడు వినాయకునికి ఎంతో ఇష్టమైనదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గణేష్ నిమర్జనం అనంతరం పాల్వంచ పట్టణ పరిధిలోని రాహుల్ గాంధీ నగర్ లో అన్నసంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి … Read more

సింగరేణిలో 43 మంది తొలగింపు బాధితులకు మళ్లీ ఉద్యోగ అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ( SCCL ) లో గతంలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా నియమించబడి.. కొన్ని కారణాల వలన తొలగింపుకు గురైన 43 మంది అభ్యర్థులకు మళ్లీ విధుల్లో చేరే అవకాశం లభించింది. కంపెనీ సీఎండీ ఎన్. బలరామ్ ఆదేశాల మేరకు యాజమాన్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక పలు పరిపాలనా పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలగింపుకు ప్రధాన కారణాలు విధులకు గైర్హాజరు కావడం, … Read more

CPGET RESULTS 2025: ఫలితాలు విడుదల

tg cpget results 2025: తెలంగాణ సీపీజీఈటీ (CPGET) 2025 ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల పరిధిలో 32 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్ లో ప్రచురిస్తారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేయబడ్డాయి. అభ్యర్థులు ర్యాంక్ కార్డు కోసం అధికారిక లింక్ ను సందర్శించవచ్చు. TELANGANA CPGET RESULTS 2025

SC గురుకులాస్ లో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ పై వివాదం

SC Gurukulas Employees Increament news: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ ఇవ్వడంపై వివాదం నెలకొంది. పదోన్నతి పొందే అర్హతలు ఉంటేనే ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రిన్సిపాల్స్ స్పష్టం చేయడంతో ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. 2019 ఆగస్టులో విధుల్లోకి చేరిన డిగ్రీ లెక్చరర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుండటం వింతగా ఉంది. లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా ఇలాంటి నిబంధన విధించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు … Read more

Revanthanna Kanuka: 65 లక్షల మహిళలకు ఉచిత చీరలు

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ‘రేవంతన్న కానుక’ పేరుతో ఉచిత చీరలు పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.318 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. చీరల సరఫరా ఇప్పటికే జిల్లాలకు ప్రారంభమైంది. శుక్రవారం నుంచి చీరలను జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ పండుగ నాటికి పంపిణీ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Balapur laddu auction 2025: బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.35 లక్షలకు అమ్ముడు

Balapur ganesh laddu auction 2025: హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈ ఏడాది రూ.35 లక్షలకు అమ్ముడైంది. గతేడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ ధర ఈ ఏడాది కొత్త రికార్డు సృష్టించింది. కర్మన్సట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం క్రమంగా రూ.లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది 38 మంది వేలంలో పాల్గొని ధరలు పెంచారు. ప్రతి ఏటా … Read more

మేడ్చల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

Mechal Teachers day celebrations : మేడ్చల్ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మేడ్చల్ లో జరిగిన వేడుకలో ప్రధానోపాధ్యాయులు ఆర్.ఎం. నాగేశ్వర్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, తాత్వికుడిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారని, దేశ రాష్ట్రపతిగా పనిచేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మంజుల, కాశి, గౌరిశంకర్ రావు, రామారావు, సరిత, SMC చైర్మన్ స్వర్ణలత, విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

BRAOU: 2025-26 డిగ్రీ, పీజీ కోర్సులకు గడువు సెప్టెంబర్ 12 వరకు పొడిగింపు

braou admission extension: డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 12, 2025 వరకు పొడిగించింది. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ కోర్సుల్లో చేరి, రెండవ లేదా మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే గతంలో డిగ్రీ … Read more

సింగరేణికి జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

మన పత్రిక, వెబ్​‌డెస్క్ పెద్దపల్లి: సింగరేణి సంస్థకుల(Singareni) జాతీయస్థాయిలో మరో గొప్ప గౌరవం దక్కింది. పర్యావరణ పరిరక్షణ, సంక్షేమం, భద్రతా చర్యల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను సింగరేణిలోని నాలుగు గనులకు కేంద్ర ప్రభుత్వం ‘ఫైవ్ స్టార్ రేటింగ్'(Five Star Rating) అవార్డులను ప్రకటించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డులు పొందిన గనుల్లో ఆర్‌జీ ఓసీ-1 ఎక్స్‌టెన్షన్, జేకే-5 … Read more