అన్నదానం ఎంతో పవిత్రమైనది – వినాయకునికి ఎంతో ఇష్టమైనది
— రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
అన్నదానం ఎంతో పవిత్రమైనదని, ఆదిదేవుడు వినాయకునికి ఎంతో ఇష్టమైనదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గణేష్ నిమర్జనం అనంతరం పాల్వంచ పట్టణ పరిధిలోని రాహుల్ గాంధీ నగర్ లో అన్నసంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరు ఎదో విధంగా ప్రక్క మనిషికి సాయం చేయాలనీ అన్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు కొత్వాల ను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమాల్లో ఉత్సవాల నిర్వాహకులు పొందూరి నర్సింహారావు, కర్నాటి వేణు, కట్టా రాంబాబు, పొందూరి వెంకట్, రఘుపతి రాజు, పల్నాటి సాయిబాబు, బూచి శ్రీనివాసరావు, మన్నెం వెంకన్న, గజ్జి శ్రీను, కొల్లి బాలకృష్ణ రెడ్డి, బొల్లం మధుసూదన్ రావు, పోతనసెట్టి వీరబ్రహ్మ, కాపా రమేష్, పాల్వంచ సొసైటీ డైరెక్టర్ ఎర్రంశెట్టి మధు, లక్ష్మణ్, కొప్పరపు రాము, తిరుమల రమేష్, తదితరులు పాల్గొన్నారు.



ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
