Advertisement

Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ఇండియా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తన సరికొత్త ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను గ్రాండ్‌గా ప్రారంభించింది. మాదాపూర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, భారతదేశంలో టెస్లాకు చెందిన ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్. జూన్ 17, 2026 నుంచి ఈ సెంటర్ అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లకు మెరుగైన సర్వీస్ సపోర్ట్ అందించేందుకు బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో డెలివరీ, ఆఫ్టర్-సేల్స్ (సర్వీసింగ్) కార్యకలాపాలను కూడా ప్రారంభించారు.

ఈ షోరూమ్‌లో కంపెనీ తన లేటెస్ట్ మోడళ్లు అయిన 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ), మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం ఈ రెండు మోడల్స్ బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. జూన్ 30, 2026 లోపు ఆర్డర్ పెట్టుకునే కస్టమర్లకు ఉచితంగా ‘వాల్ కనెక్టర్’ హోమ్ ఛార్జర్‌ను కంపెనీ కాంప్లిమెంటరీగా అందించనుంది. జులై 2026 నుంచి వీటి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

కార్ల ఫీచర్లు, ధరల వివరాలు:

  • మోడల్ వై ప్రీమియం ఆర్‌డబ్ల్యూడీ: ఐదుగురు ప్రయాణించే ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 50.89 లక్షలు.
  • మోడల్ వై ఎల్: ఆరుగురు ప్రయాణించేలా మూడు వరుసల సీటింగ్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీ సింగిల్ ఛార్జ్‌పై 681 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 61.99 లక్షలు.
Advertisement