Advertisement

TG Inter Supplementary Results 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

మన పత్రిక: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 సంవత్సరానికి గానూ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు జూన్ 11న అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో నేరుగా మార్కులను తనిఖీ చేసుకోవచ్చు.

దీనికోసం ముందుగా బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘TS Inter Advanced Supplementary Results 2026’ లింక్‌పై క్లిక్ చేసి, ఇంటర్ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఆ వెంటనే మార్కుల వివరాలతో కూడిన షార్ట్ మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు దానిని ప్రింట్ తీసి ఉంచుకోవాలి. వెబ్‌సైట్లలో ఒకేసారి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే కొద్దిసేపు వేచి ఉండి ఫలితాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

కాగా, ఈ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ (DOST) ప్రవేశాలతో పాటు ఇతర ఉన్నత చదువుల కౌన్సిలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి నేరుగా అర్హులవుతారు.

Advertisement