మన పత్రిక, ఖమ్మం: గంజాయి విక్రయం కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరికి ఖమ్మం కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. జైలు శిక్షతో పాటు సూర్యాపేటకు చెందిన అలెంటి గణేష్, బట్టు హరీష్‌లకు చెరో రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, 2022 ఏప్రిల్ 10న ఖమ్మంలోని కొత్త బస్టాండ్ సమీపంలో 7 కిలోల ఎండిన గంజాయితో నలుగురు వ్యక్తులు ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో కె. సాయి నవీన్, నేరెళ్ల శ్రీరాములు అనే ఇద్దరిని అధికారులు ఘటనా స్థలంలోనే అరెస్టు చేశారు. బట్టు హరీష్, అలెంటి గణేష్‌లు తప్పించుకోగా, వారిని పోలీసులు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన కోర్టు, ఆరోపణలు రుజువు కావడంతో వారిద్దరినీ దోషులుగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చేసింది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- నేను పార్టీ లైన్ దాటలేదు: టీడీపీ కమిటీకి బోండా ఉమ వివరణ
- Telangana Family Register: రేషన్ కార్డు ఉంటే చాలు.. మీసేవలో ఫ్యామిలీ సర్టిఫికెట్! ఓటర్ల SIR కి ఇది కూడా వర్తిస్తుంది
- ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష: పంటల రక్షణకు చర్యలు
- ముద్రగడతో వ్యక్తిగత అనుబంధమే ఉంది, రాజకీయం లేదు: జ్యోతుల నెహ్రూ
- సింహాచలంలో వైభవంగా గిరిప్రదక్షిణ పోటెత్తిన భక్తజనం
