Advertisement

కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద నీరు

మన పత్రిక, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాంతంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటి మట్టం పెరిగింది. గురువారం ఉదయం నాటికి ఇక్కడ గోదావరి 6.25 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్ర సమయానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 1,01,530 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే పరిమాణంలో 1,01,530 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

Advertisement
Advertisement