ముదుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ముదుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ పార్కు అందుబాటులోకి వస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని తెలిపారు.
ముదుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ పార్కు అందుబాటులోకి వస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని తెలిపారు.
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి ఆశయాలను తమ ప్రభుత్వం ముందడుగుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బాడా బస్సు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది విద్యార్థులు ఉన్నారు.
వరంగల్ జిల్లాలో ఉబర్ బైక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోజువారీ ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు స్థానిక డ్రైవర్లకు ఉపాధి లభిస్తుందని ప్రతినిధులు వెల్లడించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్‌పర్సన్ పోస్టుకు హాజరైన అభ్యర్థి పరీక్ష ఫలితాన్ని వెంటనే ప్రకటించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పెండింగ్ కేసులు ఉన్నంత మాత్రాన డిస్‌క్వాలిఫై చేయలేరని స్పష్టం చేసింది.
రూ.3.54 కోట్ల ఐటీసీ రీఫండ్ రీవిజన్ కేసులో పిహెచ్ జ్యువెల్స్ వేసిన రెండు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. పన్ను అధికారుల చర్యలను సమర్థించింది.
ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే ఆరోపణలను మాత్రమే మానవ హక్కుల కమిషన్ విచారించగలదని, ప్రైవేటు కంపెనీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికార పరిధి దానికి లేదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామంలోని జిలావర్‌ఖాన్ చెరువుకు చెందిన 74 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురికావడంపై తెలంగాణ హైకోర్టు సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది.
మూడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన హెడ్‌మాస్టర్‌పై వరంగల్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తును ప్రజలే తేలుస్తారని తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ స్పష్టం చేశారు.