Advertisement

జగిత్యాలలో పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు

మన పత్రిక, జగిత్యాల: జిల్లాలో సోమవారం ఒక ఆర్టీసీ అద్దె బస్సు పాఠశాల బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడగా, రెండు బస్సులు దెబ్బతిన్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాల బస్సులో 26 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు ఎలాంటి హానీ జరగలేదు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.

Advertisement

ఆర్టీసీ బస్సు బ్రేకులు విఫలం కావడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతినగా, స్కూల్ బస్సుకు స్వల్ప నష్టం వాటిల్లింది. పోలీసులు కేసు నమోదు చేసి, బ్రేకుల వైఫల్యానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement