పాముతో పోలీసులకు చుక్కలు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆటో డ్రైవర్ హల్​చల్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ ఆటో డ్రైవర్ వింతగా ప్రవర్తించాడు. తన ఆటోను సీజ్ చేయొద్దంటూ ఏకంగా పామును బయటకు తీసి పోలీసులనే భయపెట్టాడు. ఈ ఘటన శనివారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. సయ్యద్ ఇర్ఫాన్ అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో (110 పాయింట్లు) పట్టుబడ్డాడు. పోలీసులు ఆటోను సీజ్ చేయబోగా, వెంట తెచ్చుకున్న పామును చూపిస్తూ ట్రాఫిక్ ఎస్సైని బెదిరించాడు. ఆటో ఇస్తారా? లేక పామును … Read more

బాడీగార్డ్ పై సీఎం రేవంత్ చేయి చేసుకున్నారా? వైరల్ అవుతున్న వీడియో!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం దంపతులు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో, జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో సీఎం తన భద్రతా సిబ్బంది (బాడీగార్డ్)పై చేయి చేసుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, గోపూజ సమయంలో సీఎం షూలు ధరించి ప్రదక్షిణలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులైన సెక్యూరిటీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని, … Read more

కేటీఆర్: కాంగ్రెస్ నేతలను ఉరితీసినా తప్పులేదు..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ అంశంపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలను ఉరితీసినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … Read more

తెలంగాణలో కొత్త వాహనాలపై ‘సెస్’ మోత.. బైక్, కార్లపై రేట్లు ఇవే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో ఇకపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ (Road Safety Cess) పేరుతో కొత్త పన్ను వసూలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం ప్రకారం.. కొత్తగా రిజిస్ట్రేషన్ … Read more

Municipal Elections: మిర్యాలగూడలో కాంగ్రెస్‌కు షాక్: బీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు

మన పత్రిక, వెబ్​డెస్క్: మున్సిపల్ ఎన్నికల ( Telangana Municipal Elections ) వేడి అప్పుడే మొదలైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆదివారం మిర్యాలగూడ 47వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎంఏ రుక్సానా అలిం దంపతులు, దాదాపు 200 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ … Read more

నెలకు రూ. 40 వేల ఆదాయం.. కొత్త పథకం ఇదే!

indira dairy scheme

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్ (indira dairy scheme)’ పేరుతో డెయిరీ బిజినెస్ చేసే మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2 లక్షల విలువైన రెండు గేదెలను అందిస్తారు. ఇందులో 70 శాతం (రూ. 1.4 లక్షలు) ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుండగా, మిగిలిన మొత్తం బ్యాంక్ రుణంగా ఉంటుంది. పశుగ్రాసం, షెడ్ల … Read more

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. రూ.4.17 లక్షలు స్వాహా! కలెక్టర్ సీరియస్

మన పత్రిక, వెబ్​డెస్క్: పెద్దపల్లి జిల్లాలో (Peddapalli district) పంచాయతీ నిధుల దుర్వినియోగం కలకలం రేపింది. ప్రభుత్వ నిధులను జేబులో వేసుకున్న సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాస్‌పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వేటు వేశారు. శనివారం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శి శ్రీనివాస్ ఏకంగా రూ.4,17,175 నిధులను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఇంటి పన్నులో భారీ గండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి … Read more

టీచర్లకు గుడ్ న్యూస్.. టెట్ రాసేవారికి ‘ఆన్ డ్యూటీ’ సౌకర్యం

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో టెట్ (TG TET) పరీక్షకు హాజరవుతున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. టెట్ పరీక్ష రాసే టీచర్లకు పరీక్ష రోజున ‘ఆన్ డ్యూటీ’ (OD) సౌకర్యం కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. 71,670 మంది టీచర్లకు ఊరట: తెలంగాణ టెట్ (TG TET- జనవరి 2026) పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి … Read more

మా వాటా ఇవ్వాల్సిందే.. లేదంటే జూరాల నుంచే నీళ్లు లిఫ్ట్ చేస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడేదే లేదని, అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా జరిగిన “నీళ్లు-నిజాలు” స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రానికి, కేంద్రానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జూరాల నుంచే నీళ్లు తీసుకుంటాం: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) సంబంధించి తొలి విడతలో 45 టీఎంసీలు, రెండో విడతలో 45 టీఎంసీలు.. వెరసి మొత్తం 90 టీఎంసీలకు అనుమతులు … Read more

TG Municipal Elections 2026 : ఈ నెలలోనే నోటిఫికేషన్.. జనవరి 10న ఫైనల్ లిస్ట్

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల (Municipal Elections 2026) నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే.. ఈ నెలలోనే (జనవరి) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ నెల రెండో లేదా మూడో వారంలో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓటర్ల జాబితా రెడీ: ఎన్నికల సంఘం ఇప్పటికే 117 మున్సిపాలిటీలు, 6 … Read more