మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్ (TG TET) పరీక్షకు హాజరవుతున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. టెట్ పరీక్ష రాసే టీచర్లకు పరీక్ష రోజున ‘ఆన్ డ్యూటీ’ (OD) సౌకర్యం కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
71,670 మంది టీచర్లకు ఊరట: తెలంగాణ టెట్ (TG TET- జనవరి 2026) పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జరుగుతున్నాయి. ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ (KGBV), మోడల్ స్కూల్స్, ఇతర సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 71,670 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ పరీక్ష రోజున సెలవు సమస్య తలెత్తకుండా ఓడీ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
షరతు ఇదే: ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్.. డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఇచ్చినట్లుగానే, మొదటిసారి టెట్ రాస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఒకసారికి పరిమితం చేస్తూ ‘ఆన్ డ్యూటీ’ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
