మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ అంశంపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలను ఉరితీసినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉందని, సభా మర్యాదలు మంటగలుస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు, తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే అసలైన విలన్ అని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ కష్టపడి కట్టిన కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను కక్షపూరితంగానే ప్రభుత్వం పక్కన పెట్టిందని, మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టును నిలిపివేశారని ఆరోపించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
