కార్యకర్తలతో భేటీకి పిలుపు.. సురేఖకు కొత్త పోస్ట్?

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్న కొండా దంపతులు, ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కొండా సురేఖ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో భేటీ అయి … Read more

నెట్‌ఫ్లిక్స్‌లోకి రవితేజ ‘ఇరుముడి’

సినిమా: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన భావోద్వేగ చిత్రం ‘ఇరుముడి’. ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా అలరించారు. … Read more

అభిజిత్ దీప్కే కారును ముట్టడించిన ఇన్‌ఫ్లుయెన్సర్లు

మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు చేదు అనుభవం ఎదురైంది. అంతుచిక్కని వ్యాధుల బారిన పడి గిరిజన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన అడోరి, కోర్కా, బొందారి గ్రామాల్లో ఆయన పర్యటించారు. బాధితులను పరామర్శించి అక్కడి వైద్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయన పర్యటన ముగించుకుని తిరుగుపయనమవుతున్న సమయంలో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు కారును చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ మైక్ పట్టుకుని “శవాల మీద రాజకీయాలు చేయడానికి వచ్చారా? … Read more

విజయనగరం వైసీపీలో పెను మార్పులు

విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైకాపా కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనా విడుదల చేసింది. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) ఇటీవల వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఆ పదవి ఖాళీ అయింది. పార్టీ … Read more

SIIMA అవార్డ్స్‌-2026.. మెరిసిన ‘మిరాయ్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’!

సినిమా: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2026 వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. దక్షిణ భారత సినీ నటీనటుల సందడితో వేదిక కోలాహలంగా మారింది. తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన నటీనటులకు అవార్డులు ప్రధానం చేశారు. ‘మిరాయ్‌’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యువ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడిగా నిలవగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో చూపిన నటనకు ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ … Read more

గుంటూరు: ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు

AP CRIME: అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లినే కూతురు ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన మక్కెన వేంకటేశ్వరమ్మ (48) కుమార్తెకు వివాహమై పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల వల్ల తల్లి వద్దే నివాసముంటున్న ఆమెకు శ్రీనివాసరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. గత కొన్ని రోజులుగా తల్లి వీరి ప్రవర్తనను తీవ్రంగా ఖండించడమే కాకుండా … Read more

ఆసిఫాబాద్: పెళ్లయిన రెండు నెలలకే తేజస్విని మృతి

TG CRIME: జాతీయ రహదారిపై ఉన్న గుంత ఓ నవవధువు ప్రాణాలను బలితీసుకుంది. వివాహమై రెండు నెలలు కాకముందే ఘోర రోడ్డు ప్రమాదంలో అధ్యాపకురాలు మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన తేజస్విని (27) సిర్పూర్‌(టి) సాంఘిక సంక్షేమ గురుకులంలో పార్ట్‌టైం రసాయనశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కౌటాల మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిరుపతితో ఈ ఏడాది జులై 5న ఆమెకు వివాహమైంది. పొలాల పండగ నిమిత్తం సొంత … Read more

సూర్యాపేట: కాలువలో గల్లంతై ఇద్దరు విద్యార్థుల మృతి

TG CRIME: సెలవు రోజు స్నేహితులతో సరదాగా గడపాలనుకున్న ఆ బాలురకు అదే చివరి రోజు అయింది. ఈత సరదా ఇద్దరు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం గ్రామంలో చోటుచేసుకుంది. ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ముకుందపురం, కోదాడ ప్రాంతాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో శనివారం … Read more

గణేష్ భక్తులకు TGSRTC గుడ్ న్యూస్

TG: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా ఈ సేవలు సాగనున్నాయి. జేబీఎస్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సులు ప్యాట్నీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ … Read more

చరణ్‌తో పెళ్లి సమయంలో విమర్శలు ఎదుర్కొన్నా: ఉపాసన

సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త, రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన ఫిట్‌నెస్ ప్రయాణంలోని కష్టాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అమెరికాలో చదువుతున్న సమయంలో ఒత్తిడి కారణంగా ఎక్కువగా తినడం వల్ల 18 ఏళ్ల వయసులోనే 95 కిలోల బరువు పెరిగినట్లు తెలిపారు. ఓట్స్, హై ప్రొటీన్ ఆహారం తీసుకోవడం, రోజూ 10 వేల అడుగులు నడవడంతో బరువు తగ్గానని చెప్పారు. చరణ్‌తో వివాహం సమయంలోనూ “చరణ్‌కు ఆమె తగిన జోడీ కాదు, లావుగా ఉంది” … Read more