Advertisement

గుంటూరు: ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు

AP CRIME: అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లినే కూతురు ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన మక్కెన వేంకటేశ్వరమ్మ (48) కుమార్తెకు వివాహమై పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల వల్ల తల్లి వద్దే నివాసముంటున్న ఆమెకు శ్రీనివాసరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. గత కొన్ని రోజులుగా తల్లి వీరి ప్రవర్తనను తీవ్రంగా ఖండించడమే కాకుండా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. దీంతో తల్లిని వదిలించుకోవాలని భావించిన కూతురు, ప్రియుడితో కలిసి పథకం రచించింది.

మంగళవారం రాత్రి తల్లి నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు నాటకమాడినా, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement