Advertisement

చరణ్‌తో పెళ్లి సమయంలో విమర్శలు ఎదుర్కొన్నా: ఉపాసన

సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త, రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన ఫిట్‌నెస్ ప్రయాణంలోని కష్టాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అమెరికాలో చదువుతున్న సమయంలో ఒత్తిడి కారణంగా ఎక్కువగా తినడం వల్ల 18 ఏళ్ల వయసులోనే 95 కిలోల బరువు పెరిగినట్లు తెలిపారు. ఓట్స్, హై ప్రొటీన్ ఆహారం తీసుకోవడం, రోజూ 10 వేల అడుగులు నడవడంతో బరువు తగ్గానని చెప్పారు.

చరణ్‌తో వివాహం సమయంలోనూ “చరణ్‌కు ఆమె తగిన జోడీ కాదు, లావుగా ఉంది” అంటూ కొందరు విమర్శలు చేశారని, మొదట్లో వాటికి బాధపడినా ఆ తర్వాత వాటి వల్లే మానసికంగా దృఢంగా మారామని తెలిపారు. ఇక తనకు, తన తల్లికి నిద్రలేమి సమస్య ఉందని, దీనికోసం త్వరలో ఓ ‘స్లీప్ క్లినిక్’ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మానసిక ప్రశాంతత కోసం సద్గురు ప్రవచనాలు వింటామని, చరణ్‌తో కలిసి వర్కవుట్లు చేస్తానని చెప్పారు. కాగా, చరణ్-ఉపాసన దంపతులకు కూతురు క్లీంకారతో పాటు ఈ ఏడాది జనవరిలో కవలలు (శివరామ్, అన్వీరా దేవి) జన్మించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement