Advertisement

SIIMA అవార్డ్స్‌-2026.. మెరిసిన ‘మిరాయ్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’!

సినిమా: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2026 వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. దక్షిణ భారత సినీ నటీనటుల సందడితో వేదిక కోలాహలంగా మారింది. తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన నటీనటులకు అవార్డులు ప్రధానం చేశారు.

‘మిరాయ్‌’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యువ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడిగా నిలవగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో చూపిన నటనకు ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటిగా (క్రిటిక్స్) ఎంపికయ్యారు. కన్నడ నుంచి ‘కాంతార: చాప్టర్‌ 1’ చిత్రంతో అలరించిన రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు.

Advertisement
  • ఉత్తమ నటుడు: తేజ సజ్జా (మిరాయ్‌)
  • ఉత్తమ నటి: ఐశ్వర్య రాజేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ హాస్య నటుడు: బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ గాయకుడు: రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ గాయని: సమీరా భరద్వాజ్‌ (కోర్టు)
  • ఉత్తమ తొలిచిత్ర నటి: సాక్షి మడోల్కర్ (మోగ్లీ)
Advertisement