ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు రేపు ఘనంగా ముహూర్తం
ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్న బయోపిక్ ప్రారంభోత్సవానికి చెన్నై నగరం వేదిక కానుంది.
ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్న బయోపిక్ ప్రారంభోత్సవానికి చెన్నై నగరం వేదిక కానుంది.
కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ డిజిటల్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (వర్ధరాజపూర్) పసుపు నీళ్ల శుద్ధి ఘటనపై విచారణ వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలను వెలికితీసేందుకు అధికారులు సిట్‌ను రంగంలోకి దించారు. దీంతో దర్యాప్తు ప్రక్రియ మరింత కీలక దశకు చేరుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో లోతైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వర్ధరాజపూర్‌లో ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దర్యాప్తులో అత్యంత కీలక పరిణామంగా … Read more
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు అజయ్ (28), ఆయన భార్య దినేశ్వరి (25) గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చి వకీల్‌పల్లిలో కూలీ పనులు చేసుకుంటూ ఈ దంపతులు జీవిస్తున్నారు. సోమవారం వారికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తోటి కూలీలకు తెలిపారు. వెంటనే వారిని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అజయ్ మృతి చెందాడు. ఆస్పత్రిలో … Read more
వినాయక చవితి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెంలో పూజారి ఉప్పల దత్తు ప్రసాద్ (నాగార్జునసాగర్) మండపంలో పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందారు. సోమవారం చింతలపాలెంలోని రామాలయం వద్ద గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్య వచ్చి తమ మండపం వద్దే ముందు పూజ చేయాలని గొడవకు దిగారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పి, రవి మండపం వద్దకు పూజారిని తీసుకెళ్లారు. … Read more
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ, ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు నాన్-యూనిఫాం ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండేది. దీన్ని ఏకంగా 10 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఇప్పుడు 44 ఏళ్లకు సవరించింది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అపారమైన అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు, యూనిఫాం సర్వీసులకు … Read more
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న పలుచోట్ల కుండపోత వర్షాలు కురవగా.. నేడూ వానలు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తెలంగాణలో పగటిపూట ఉక్కపోత ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారుతుంది. నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, మెదక్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో చెదురుమదురు తుఫాను ముప్పు పొంచి ఉంది. రాజధాని … Read more
భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు మరియు మృతురాలి బంధువుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్‌కు, తన మేనకోడలు మిల్లీ బిస్వాస్(21)తో ఈ ఏడాది జూన్ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఈ దంపతులు వరంగల్‌కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారంలో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. అయితే … Read more
తెలంగాణ రక్షణ సేనలో నియామకాల పర్వం జోరుగా సాగుతోంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జులను అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటించారు. దీంతో పాటు మెదక్ లోక్‌సభతో పాటు వివిధ అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షులను నియమించారు. ఇప్పటికే 42 స్థానాలకు బాధ్యులను ప్రకటించిన కవిత, తాజా జాబితాతో కలిపి మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల నియామకాలను పూర్తి చేశారు. అలాగే 9 జిల్లాలకు అధ్యక్షులు, 3 … Read more
రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడ మండలం పీర్జాపూర్ గ్రామంలో వినాయక ప్రతిష్ట వివాదం సంచలనం సృష్టించింది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. అదే ఆలయంలో తాము తయారు చేసిన గణనాథుడిని ప్రతిష్ఠిస్తామని ఒక వర్గం పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా … Read more