ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ, ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదివరకు నాన్-యూనిఫాం ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండేది. దీన్ని ఏకంగా 10 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఇప్పుడు 44 ఏళ్లకు సవరించింది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అపారమైన అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు, యూనిఫాం సర్వీసులకు మాత్రం జనరల్ కేటగిరీలో కేవలం రెండేళ్లు మాత్రమే వయోపరిమితిని పెంచారు.
ఈ సడలింపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వయోభారంతో ఉద్యోగావకాశాలు కోల్పోతామనే ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
