బాడీగార్డ్ పై సీఎం రేవంత్ చేయి చేసుకున్నారా? వైరల్ అవుతున్న వీడియో!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం దంపతులు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో, జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో సీఎం తన భద్రతా సిబ్బంది (బాడీగార్డ్)పై చేయి చేసుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, గోపూజ సమయంలో సీఎం షూలు ధరించి ప్రదక్షిణలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులైన సెక్యూరిటీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని, … Read more

కేటీఆర్: కాంగ్రెస్ నేతలను ఉరితీసినా తప్పులేదు..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ అంశంపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలను ఉరితీసినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … Read more

తెలంగాణలో కొత్త వాహనాలపై ‘సెస్’ మోత.. బైక్, కార్లపై రేట్లు ఇవే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో ఇకపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ (Road Safety Cess) పేరుతో కొత్త పన్ను వసూలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం ప్రకారం.. కొత్తగా రిజిస్ట్రేషన్ … Read more

గోదావరి నీళ్లు సముద్రం పాలు.. ఆ వ్యాఖ్యలు సరికాదు: ఎమ్మెల్యే సోమిరెడ్డి

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఏటా సుమారు 2,000 నుంచి 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, వీటి వినియోగంపై వివాదాలు సృష్టించడం సరికాదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. అంతర్రాష్ట్ర జలాల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, నీటిని రాజకీయ అస్త్రంగా మార్చొద్దని ఆయన మండిపడ్డారు. విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో ఉన్నారని గుర్తుచేశారు. గతంలో రాయలసీమను రత్నాల … Read more

Municipal Elections: మిర్యాలగూడలో కాంగ్రెస్‌కు షాక్: బీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు

మన పత్రిక, వెబ్​డెస్క్: మున్సిపల్ ఎన్నికల ( Telangana Municipal Elections ) వేడి అప్పుడే మొదలైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆదివారం మిర్యాలగూడ 47వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎంఏ రుక్సానా అలిం దంపతులు, దాదాపు 200 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ … Read more

భోగాపురంలో: ఉత్తరాంధ్రకు పండుగ రోజు.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఇదొక మర్చిపోలేని రోజు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం (జనవరి 4) తొలి విమానం (ట్రయల్ రన్) విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా టెస్ట్ ఫ్లైట్ ఉదయం 11 గంటలకు సురక్షితంగా దిగడంతో అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే జూన్ నాటికి మిగిలిన 4 … Read more

నెలకు రూ. 40 వేల ఆదాయం.. కొత్త పథకం ఇదే!

indira dairy scheme

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్ (indira dairy scheme)’ పేరుతో డెయిరీ బిజినెస్ చేసే మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2 లక్షల విలువైన రెండు గేదెలను అందిస్తారు. ఇందులో 70 శాతం (రూ. 1.4 లక్షలు) ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుండగా, మిగిలిన మొత్తం బ్యాంక్ రుణంగా ఉంటుంది. పశుగ్రాసం, షెడ్ల … Read more

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు రకాల అకౌంట్లు క్లోజ్ అయ్యే ఛాన్స్!

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా ఎక్కువ కాలం వినియోగంలో లేని ఖాతాలపై బ్యాంకులు కఠిన చర్యలు తీసుకోనున్నాయి. వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగని ‘డోర్మెంట్ ఖాతాలు’, గత 12 నెలలుగా వాడని ‘ఇన్‌యాక్టివ్ ఖాతాలు’, అలాగే చాలా కాలంగా సున్నా … Read more

చిరు-వెంకీల మాస్ రచ్చ: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది!

మన పత్రిక, వెబ్​డెస్క్: సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు (mana shankara varaprasad garu trailer)’ సినిమాతో వినోదాల విందు పంచేందుకు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ ఈ ఆదివారం విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, కామెడీతో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగింది. చిరు వింటేజ్ లుక్, నయనతారతో కెమిస్ట్రీ, అత్తమామలతో చిరు పడే ఫ్రస్ట్రేషన్ కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తున్నాయి. … Read more

సంక్రాంతికి ఊరెళ్లే వారికి అలర్ట్.. ఇంటికి తాళం వేస్తున్నారా? అయితే ఇది తప్పక చేయండి!

మన పత్రిక, వెబ్​డెస్క్: సంక్రాంతి పండుగ రద్దీ మొదలవుతున్న వేళ హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ నగరవాసులకు కీలక సూచనలు చేశారు. పండుగ కోసం కుటుంబంతో సహా సొంతూళ్లకు వెళ్లేవారు.. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా సంబంధిత బీట్ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇలా ముందస్తు సమాచారం అందించడం వల్ల.. పోలీసులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్‌లో ఆయా ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని తెలిపారు. … Read more