మన పత్రిక వెబ్‌డెస్క్, అమరావతి: ఏటా సుమారు 2,000 నుంచి 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, వీటి వినియోగంపై వివాదాలు సృష్టించడం సరికాదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. అంతర్రాష్ట్ర జలాల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, నీటిని రాజకీయ అస్త్రంగా మార్చొద్దని ఆయన మండిపడ్డారు. విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో ఉన్నారని గుర్తుచేశారు.
గతంలో రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రస్తావించారు. అనుమతులు ఉన్న బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలొద్దని, రెండు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు భేటీ అయి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. మరోవైపు కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ప్రతిపాదన రెండు రాష్ట్రాలకు ప్రమాదకరమని, దీనిపై తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సఖ్యతతో ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
