కరెంట్ షాక్‌తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం … Read more

కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ.35 కోట్లతో టీటీడీ పనులకు శంకుస్థాపన

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించనున్నారు. 2026 జనవరి 3 (శనివారం) ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం పనులకు భూమిపూజ నిర్వహిస్తారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా … Read more

Sangareddy: బైక్ బోల్తా, ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్-బీదర్ జాతీయ రహదారి (NH 161B)పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నర్సింహులు (27), మల్లేష్ (24), మహేష్ (23)గా గుర్తించారు. వీరు వరుసకు బావ, బావమరుదులు అవుతారు. నర్సాపూర్ నుంచి నారాయణఖేడ్ వచ్చి తిరిగి వెళ్తుండగా, శివారులో కొత్తగా నిర్మిస్తున్న హైవే పక్కన ఉన్న కల్వర్టు గుంతలో బైక్ … Read more

సంక్రాంతి కోడి పందేలు.. ముదినేపల్లిలో భారీ ఏర్పాట్లు

సంక్రాంతి పండుగకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో కోడి పందేల నిర్వహణకు పందెంరాయుళ్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గురజ, పెదపాలపర్రు, వాడవల్లి, వైఎస్ఆర్ కాలనీ తదితర గ్రామాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేసే పనులు ఊపందుకున్నాయి. పోలీసులు జూదం సాగనివ్వబోమని హెచ్చరిస్తున్నా, పండుగ సంబరాల పేరుతో పందేలకు సై అంటున్నారు. గత నాలుగు నెలలుగా ప్రత్యేక షెడ్లలో పందెం కోళ్లను పోషిస్తున్నారు. కాకి, డేగ, నెమలి, పింగళి వంటి జాతి … Read more

నేడు కేసీఆర్ కీలక భేటీ.. రేవంత్ సర్కార్‌పై ఫైర్

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో నీళ్ల రాజకీయం భగ్గుమంటోంది. కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడంపై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి … Read more

పటాన్‌చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు.. జనవరి 4న మైత్రి మైదానంలో ఈవెంట్

మన పత్రిక, వెబ్​డెస్క్: పటాన్‌చెరు పట్టణం జాతీయ స్థాయి క్రీడా సంబరానికి వేదిక కానుంది. జనవరి 4న స్థానిక మైత్రి మైదానంలో ‘జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్’ పోటీలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. యువత శారీరక దారుఢ్యం, మానసిక క్రమశిక్షణతో ఎదగాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు. పటాన్‌చెరు గడ్డపై తొలిసారిగా … Read more

అనుమానంతో భార్యను సజీవ దహనం చేసిన భర్త

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ నల్లకుంటలో గుండెలు పగిలే దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణి నిద్రిస్తుండగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘాతుకానికి పాల్పడే ముందు తన కుమారుడిని ఇంటి బయట నిలబెట్టడం గమనార్హం. మంటల్లో చిక్కుకున్న త్రివేణి అక్కడికక్కడే సజీవ దహనమైంది. అయితే, ఈ ప్రమాదం నుంచి కుమార్తె అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఘటన … Read more

రైల్వే టికెట్ ధరల పెంపు.. నేటి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు

మన పత్రిక, వెబ్​డెస్క్: రైల్వే ప్రయాణికులపై అదనపు భారం పడింది. పెరిగిన రైల్వే టికెట్ ధరలు నేటి నుంచి (డిసెంబర్ 26) అమల్లోకి వచ్చాయి. దూర ప్రయాణాలను బట్టి ఈ పెంపు వర్తిస్తుంది. 216 నుంచి 750 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 5, 751-1250 కి.మీలకు రూ. 10, 1251-1750 కి.మీలకు రూ. 15, అలాగే 1751 కి.మీ దాటితే రూ. 20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్, ఫస్ట్ క్లాస్ చార్జీలను కిలోమీటరుకు ఒక పైసా … Read more

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం!

మన పత్రిక, వెబ్​డెస్క్: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. రద్దీ భారీగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి. ప్రస్తుతం టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదం, వైద్య సహాయం నిరంతరం అందిస్తున్నట్లు … Read more

రాహుల్ గాంధీ ఫైర్.. చిన్న వ్యాపారులకు అండగా ఉంటా!

మన పత్రిక, వెబ్​డెస్క్: బీజేపీ ప్రభుత్వ విధానాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వైశ్య సమాజం నేడు నిరాశలో కూరుకుపోయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛనిస్తూ.. చిన్న, మధ్యతరహా వ్యాపారులను తప్పుడు … Read more