మన పత్రిక, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నల్లకుంటలో గుండెలు పగిలే దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణి నిద్రిస్తుండగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘాతుకానికి పాల్పడే ముందు తన కుమారుడిని ఇంటి బయట నిలబెట్టడం గమనార్హం.
మంటల్లో చిక్కుకున్న త్రివేణి అక్కడికక్కడే సజీవ దహనమైంది. అయితే, ఈ ప్రమాదం నుంచి కుమార్తె అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఘటన అనంతరం నిందితుడు వెంకటేశ్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
