మన పత్రిక, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించనున్నారు. 2026 జనవరి 3 (శనివారం) ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం పనులకు భూమిపూజ నిర్వహిస్తారు.
ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా ఈ మండపం నిర్మాణం జరగనుంది. హనుమాన్ మాలధారుల సౌకర్యార్థం టీటీడీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
