ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో 84 మండలాల్లో వడగాల్పుల తీవ్రత

మన పత్రిక అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో అల్లాడిన ప్రజలకు ఇప్పుడు భానుడి సెగలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండ … Read more

రంగారెడ్డి: నేడు పరీక్ష.. నిన్న పదో తరగతి విద్యార్థి మృతి

మన పత్రిక, తెలంగాణ: పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నిండింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తొర్రూరు గ్రామానికి చెందిన బచ్చిగళ్ల శంకరయ్య, అనిత దంపతుల కుమారుడు అభిలాష్‌ (16) ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల … Read more

HYD: చిరంజీవి గొప్ప మనసు.. అవార్డు డబ్బు విరాళంగా

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో పాటు తనకు అందిన రూ.10 లక్షల నగదును ఆయన వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ప్రకటించారు. సామాజిక బాధ్యతగా ఈ మొత్తాన్ని సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లకు అందజేశారు. వీటితో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి … Read more

సుంకం తగ్గినా.. వినియోగదారులకు అందని రూ. ‘పది’ తగ్గింపు

మన పత్రిక, కేంద్రం: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 మేర తగ్గించిన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ తగ్గింపు నేరుగా వినియోగదారులకు లభించదనే అంశం స్పష్టమవుతోంది. ఈ ఉపశమనం ప్రధానంగా HP, BP, IOC వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకే వర్తిస్తుంది. క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఖర్చులు భారీగా పెరగడంతో ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. … Read more

రేపటి నుంచి ఐపీఎల్.. RCBకి కీలక బౌలర్ దూరం!

మన పత్రిక, స్పోర్ట్స్: రేపు ప్రారంభమయ్యే Indian Premier Leagueకు ముందే Royal Challengers Bengaluruకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. జట్టుకు కీలక బౌలర్‌గా భావించిన నువాన్ తుషారా(Nuwan Thushara) ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు ఎన్‌ఓసీ ఇవ్వడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు సమాచారం. గాయం ఏదీ లేకపోయినా ఫిట్‌నెస్ సరిగా లేదనే కారణంతో ఐపీఎల్‌లో పాల్గొనడాన్ని అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్(Chaminda … Read more

లాక్‌డౌన్ వార్తలు.. కేంద్రం మంత్రి ఏమన్నారంటే..?

మన పత్రిక: దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ విధించే అవకాశముందన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, లాక్‌డౌన్‌పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి సమయంలో ఐకమత్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్న మంత్రి, … Read more

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై శుభవార్త

మన పత్రిక, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ఎటువంటి అనిశ్చితి నెలకొన్నా, దేశీయ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి పౌరుడికి రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దీనికి అదనంగా, తదుపరి రెండు నెలల అవసరాలను తీర్చేందుకు వీలుగా ముడి చమురు … Read more

తిరుపతి: పాల కోపం ఏడ్చిందని.. కూతురిని చంపేసింది

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: పాల కోసం ఏడుస్తోందని ఆగ్రహించిన ఓ తల్లి.. ఆరు నెలల పసికందును ఊపిరాడకుండా చేసి చంపేసిన అమానుష ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో జరిగింది. తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌కు, హేమావతితో 2018లో వివాహమైంది. వీరికి కుమారుడు రుత్విక్(5), కుమార్తె జోషిక(6 నెలలు) ఉన్నారు. గురువారం ఉదయం వెంకటేశ్ పనికి వెళ్లిన కొద్దిసేపటికే హేమావతి ఫోన్ చేసి.. “నీకో బ్యాడ్ న్యూస్, నాకో గుడ్ న్యూస్.. పాపను చంపేశాను” అని … Read more

నేడే శ్రీరామనవమి..శుభ ముహూర్తం ఎప్పుడంటే

మన పత్రిక: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ ఏడాది పూజాదికాలకు సంబంధించి పండితులు ముఖ్యమైన సమయాలను సూచించారు. ముహూర్త విశేషాలు భక్తులకు సూచనలు ఇంట్లో పూజ చేసుకునే భక్తులు మధ్యాహ్నం ఒంటి గంటలోపు స్వామివారికి నైవేద్యం (వడపప్పు, పానకం) సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాతే ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. రామాలయాలన్నీ భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి.

HYD: 29, 30వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. నిరంతరం ప్రజా సమస్యలు, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి రాష్ట్రం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రస్తుత శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ పర్యవేక్షణలో … Read more