మన పత్రిక: ప్రముఖ తమిళ నటుడు సూరి కథానాయకుడిగా, తెలుగు నటుడు సుహాస్ ప్రతి నాయకుడిగా నటించిన ‘మందడి’ సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8, గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
బాక్సాఫీస్ సాధన, కథాంశం
మాడిమారన్ పుగజేంధి దర్శకత్వంలో దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్ర తీరం, పడవల పోటీల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఆక్షన్ డ్రామా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹135 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
కాళింగపట్నం అనే తీరప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. గతంలో ప్రాణస్నేహితులుగా ఉన్న ముత్తు కాళి (సూరి), సట్టా పులి (సుహాస్) మధ్య పడవల పోటీల వల్ల వచ్చిన వైరం, తదనంతర పరిణామాలను దర్శకుడు ఇందులో చూపించారు. మల్లేశ్ అనే యువకుడి వల్ల కథలో వచ్చే మలుపులు, హైదరాబాద్ వెళ్లిపోయిన కాళి తిరిగి సొంతూరికి రావడం చుట్టూ సన్నివేశాలు నడుస్తాయి.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
