యూట్యూబ్ స్టార్ టు సర్పంచ్..

మన పత్రిక, వెబ్​డెస్క్: సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారి, ఇప్పుడు ప్రజాసేవలో నిమగ్నమయ్యారు ఓ యువతి. షార్ట్ ఫిలింల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన రజిత.. ఇప్పుడు సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేశారు. యూట్యూబర్‌గా మొదలైన ఆమె ప్రయాణం, నేడు ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యే స్థాయికి చేరింది. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సర్పంచ్‌గా ఎన్నికైన రజిత, మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలతో … Read more

రోడ్లపై కేక్ కటింగ్ చేస్తే కేసులే.. ఎస్పీ సీరియస్ వార్నింగ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల వేళ సూర్యాపేట జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచే విస్తృత తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఇవే: Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, … Read more

మాజీ సర్పంచ్ తల్లి మృతి.. కాంగ్రెస్ నేతల నివాళి

మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ గౌడ్ మాతృమూర్తి గుండాల ఆండాలు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గ్రామానికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి … Read more

Telangana Assembly: ఇరిగేషన్‌పై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. పాలమూరుపై ఆరా

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సాగునీటి రంగం, ప్రాజెక్టుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్న అంశాలపై సీఎం ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నదీజలాల వాటా, ఏపీతో కొనసాగుతున్న జల … Read more

‘సిక్స్త్ సెన్స్’తో విడిపోయిన జంట ఒక్కటి.. కానీ ఈ ప్రశ్నలకు జవాబేది?

మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక రేప్ కేసు విచారణలో సుప్రీంకోర్టు అరుదైన, ఆసక్తికర తీర్పునిచ్చింది. పరస్పర అపార్థాల వల్ల విడిపోయి, ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష వరకు వెళ్లిన ఓ జంటను తన ‘అసాధారణ అధికారాలను’ (Article 142) ఉపయోగించి తిరిగి కలిపింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం తమ ‘సిక్స్త్ సెన్స్’ (Sixth Sense) ద్వారా వీరు కలుస్తారని ముందే గ్రహించామని వ్యాఖ్యానించింది. అసలేం జరిగిందంటే: 2015లో సోషల్ మీడియాలో … Read more

శివాజీ వ్యాఖ్యలపై రచ్చ.. బట్టల సత్తిగాడు అంటూ ఎస్‌కేఎన్ ఘాటు కౌంటర్

మన పత్రిక, వెబ్​డెస్క్: “అసభ్య వస్త్రధారణే మందల ప్రవర్తనకు కారణమా?” అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎదుట ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, తనపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. అయితే, సమస్య బట్టల్లో లేదని, అది కేవలం ‘మూక ఉన్మాదం’ అని సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు. నిండుగా కప్పుకున్నా సమంత వంటి వారికి గతంలో ఇబ్బందులు తప్పలేదని, మగాళ్లను కూడా ఈ మూకలు వదలవని గుర్తుచేస్తున్నారు. తాజాగా … Read more

సిమెంట్ మిల్లర్‌లో చిక్కుకుని యువకుడి చేయి నుజ్జునుజ్జు

మన పత్రిక, వెబ్​డెస్క్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లిలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్లాబ్ వేస్తుండగా సిమెంట్ మిల్లర్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్న కొమరం మహేశ్ అనే యువకుడి చేయి ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుంది. దీంతో అతని మణికట్టు వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది కిషన్, రఫిక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం … Read more

కరెంట్ షాక్‌తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం … Read more

కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ.35 కోట్లతో టీటీడీ పనులకు శంకుస్థాపన

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించనున్నారు. 2026 జనవరి 3 (శనివారం) ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం పనులకు భూమిపూజ నిర్వహిస్తారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా … Read more

హైదరాబాద్ క్రైమ్త గ్గిన నేరాలు.. మహిళలపై పెరిగిన కేసులు

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ నగరంలో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ విడుదల చేశారు. నగరంలో ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 15 శాతం తగ్గినప్పటికీ, మహిళలు, చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2024తో పోలిస్తే మొత్తం కేసులు 35,944 నుంచి 30,690కి తగ్గాయని సిపి వెల్లడించారు. అయితే, మహిళలపై నేరాలు 6 శాతం పెరిగాయని, ముఖ్యంగా గృహ హింస కేసులు 31 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం … Read more