మన పత్రిక, వెబ్డెస్క్: “అసభ్య వస్త్రధారణే మందల ప్రవర్తనకు కారణమా?” అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎదుట ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, తనపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. అయితే, సమస్య బట్టల్లో లేదని, అది కేవలం ‘మూక ఉన్మాదం’ అని సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు. నిండుగా కప్పుకున్నా సమంత వంటి వారికి గతంలో ఇబ్బందులు తప్పలేదని, మగాళ్లను కూడా ఈ మూకలు వదలవని గుర్తుచేస్తున్నారు.
తాజాగా ‘పతంగ్’ సక్సెస్ మీట్లో నిర్మాత ఎస్కేఎన్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. “మహిళలు తమకు నచ్చిన, సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి. ఎవడో ‘బట్టల సత్తిగాడు’ చెప్పిన మాటలు పట్టించుకోవద్దు” అంటూ పరోక్షంగా చురకలు అంటించారు. పబ్లిసిటీ కోసమే కొందరు ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని, బట్టలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలే తప్ప, ఇతరుల విమర్శలకు భయపడకూడదని ఆయన హితవు పలికారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
