మన పత్రిక, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లిలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్లాబ్ వేస్తుండగా సిమెంట్ మిల్లర్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్న కొమరం మహేశ్ అనే యువకుడి చేయి ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుంది. దీంతో అతని మణికట్టు వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది.
సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది కిషన్, రఫిక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహేశ్‌ను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ఆసుపత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
