భువనగిరి: సుద్దాల స్ఫూర్తి అజరామరం.. తరాలు మారినా తరగని పాట

TG Yadadri bhuvanagiri: ప్రజాకవిగా పేరొందిన సుద్దాల హనుమంతు పాటలు తరాలు మారినా నేటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ‘పల్లెటూరీ పిల్లగాడా…’ వంటి అజరామర గీతాలతో ఆయన నిజాం కాలపు వెట్టి బతుకులను కళ్లకు కట్టారు. ఆయన గళం విప్పితే అది ప్రజల గుండెల్లోంచి వచ్చిన ఆక్రోశంగా వినిపించేది. ‘వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ…’ అంటూ ఆయన పాటల్లో రగిలించిన స్ఫూర్తి అజరామరం. సరిగ్గా 1982లో ఇదే రోజున (అక్టోబరు 10) ఆ గొంతుక మూగబోయింది. … Read more

కరీంనగర్: ACBకి చిక్కిన మరో అవినీతి చేప..!

TG Karimnagar: లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గంగాధర మండలం మధురా నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్‌ను శుక్రవారం ఓ లబ్ధిదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. మధురా నగర్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరు విషయంలో కార్యదర్శి లబ్ధిదారుడిని వేధించారు. బిల్లుల కోసం అనిల్ రూ.10,000 లంచం తీసుకుంటుండగా … Read more

HYDERABAD: ఓపెన్ SSC, INTER గడువు పొడిగింపు

Telangana: ఉమ్మడి రంగారెడ్డి (RR), హైదరాబాద్ (HYD) జిల్లాల్లో చదువు మానేసిన విద్యార్థులకు శుభవార్త. ఓపెన్ ఎస్సెస్సీ (SSC), ఇంటర్ (INTER) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ అధికారులు గురువారం తెలిపారు. విద్యార్థులు ఫైన్ లేకుండా ఈనెల 13వ తేదీలోగా, అలాగే ఫైన్‌తో ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గలవారు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

తెలంగాణా: కోర్టు స్టేతో అభ్యర్థుల ఆశలపై నీళ్లు

Telangana: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నం.9 తో పాటు, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ‘అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని భావించిన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చాలా రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టి, నామినేషన్లు వేద్దామనుకునే లోపే ప్రక్రియ నిలిచిపోవడంతో టైం వృథా అయిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికలు ఇప్పుడే జరగవని తెలిసి ఉంటే ప్రచారానికి బయటకు వచ్చే వాళ్లమే … Read more

ఆదిలాబాద్: దిగుబడులు తగ్గిపోవడంతో రైతుల ఆందోళన

TG Adilabad: పత్తి సాగు చేసిన అన్నదాతలకు ఈసారి ప్రకృతి నుంచి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్షాల ధాటికి కాత (కాయ), పూత పూర్తిగా నష్టపోయాయి. దీని ఫలితంగా, గతంతో పోలిస్తే దిగుబడులు ఏకంగా సగానికి తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ (ADB) ప్రాంతంలో ఈసారి సుమారు 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. … Read more

దేవరుప్పుల: పత్తి రైతులు లింగాకర్షణ బుట్టలు వాడాలి

TG Warangal: దేవరుప్పుల మండలం పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించే గులాబీ రంగు పురుగులను అరికట్టడానికి లింగాకర్షణ బుట్టలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. చిన్నమడూరు గ్రామంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ.. ప్రతి ఎకరంలో 8 నుంచి 10 బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే మార్కెట్లో అధిక ధర లభించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీఐ రైతులు పాల్గొన్నారు.

TG TET 2025: టెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో

TG TET NOVEMBER 2025

మన పత్రిక, హైదరాబాద్: వచ్చే నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( TELANGANA TET 2025 ) నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి జీవోలో మార్పులు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు, ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశం కూడా ప్రకటనలో పేర్కొనే అవకాశం ఉంది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధనను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దాదాపు పదేళ్లలో కేవలం … Read more

RRB NTPC Recruitment 2025: 8050 ఉద్యోగాలు సొంత జిల్లాలోనే పోస్టింగ్!

RRB NTPC Recruitment 2025

RRB NTPC 8050 Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8050 ఖాళీలు – 5000 గ్రాడ్యుయేట్, 3050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తులు ఆరంభమవుతాయి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 21 అక్టోబర్ నుంచి, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 28 అక్టోబర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ – 27 నవంబర్ 2025. ఎంపిక కోసం CBT-1 & 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. … Read more

హాజీపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్సై స్వరూప్ రాజ్ కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కోడిగుడ్ల కోసం ప్రధాన రహదారిపైకి నడుచుకుంటూ వచ్చిన శ్రీనివాస్‌ను బైక్ ఢీకొంది. గాయపడిన శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ ముఖ్య సమావేశం.

Bhadradri Kothagudem District Press Club important meeting.

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో సమావేశం. kothagudem news today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షుడు రత్నకుమార్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరచడంలో పాత్రికేయులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని . రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ఎలా ఆకర్షించే … Read more