మన పత్రిక, హైదరాబాద్: వచ్చే నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( TELANGANA TET 2025 ) నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి జీవోలో మార్పులు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు, ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశం కూడా ప్రకటనలో పేర్కొనే అవకాశం ఉంది.
ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధనను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దాదాపు పదేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే పరీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి ఏటా రెండు సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు జరిగాయి. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు చర్యలు మొదలుపెట్టారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, 2011 తర్వాత టీచర్ ఉద్యోగం చేయాలంటే టెట్ క్వాలిఫై చేయాలనే నిబంధన ఉంది. కానీ ఇప్పుడు అందరి టీచర్లకూ వర్తించేలా జీవోలో సవరణలు చేయాలని అధికారులు సూచించారు. ఈ సవరణ తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అనే అంశంపై విద్యాశాఖ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. కానీ, ఇది టెట్ నోటిఫికేషన్ ప్రకటనతో సంబంధం లేకుండా స్వతంత్రంగా కొనసాగుతుంది. సుమారు 45 వేల మంది ఇన్‌సర్వీస్ టీచర్లు రెండేళ్లలో టెట్ క్వాలిఫై చేయాల్సి ఉంది. ప్రమోషన్ల కోసం పోటీ పడే వారిని కలుపుకుంటే 60 వేల మంది వరకూ ఉండొచ్చు. వారంతా ఈసారి పరీక్ష రాసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
