ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

మన పత్రిక: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకోవడానికి సరిపడా కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికను వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా బీజేపీ … Read more

కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో

మన పత్రిక, తెలంగాణ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్‌చల్ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు అనుముల రేవంత్ రెడ్డి ఫోటోతో క్యాంప్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లి, అక్కడ సీఎం ఫోటోను ఏర్పాటు చేశారు. అనంతరం కార్యాలయంలోనే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు … Read more

క్యాతన్‌పల్లి బీఆర్ఎస్ కైవసం

మన పత్రిక: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పలుమార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలు శనివారం నిర్వహించగా, బీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయం సాధించింది. చైర్మన్‌గా సంధ్యారాణి (బీఆర్ఎస్), వైస్ చైర్మన్‌గా సరిత (సీపీఐ) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండటం గమనార్హం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ 10, సీపీఐ 4 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 7, ఒక ఇండిపెండెంట్‌కు ఒక స్థానం లభించింది. అయితే … Read more

‘పోలీస్ మామల స్క్వాడ్’ బట్టబయలు.. వాట్సాప్ గ్రూప్‌లో ఎస్సై ఎంట్రీ

మన పత్రిక, తెలంగాణ వైరల్: పోలీసుల తనిఖీలను తప్పించుకోవడానికి కొందరు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, గోదావరిఖనిలో కొందరు యువకులు ‘పోలీస్ మామల స్క్వాడ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించారు. నగరంలో పోలీసులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు, ఎక్కడ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అనే వివరాలను గ్రూప్‌లో పరస్పరం పంచుకుంటూ, ఆ మార్గాలను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఒక యువకుడు పోలీసులకు చిక్కాడు. … Read more

హైదరాబాద్: పెళ్లి దుస్తుల్లో ధరించి OYOలో సూసైడ్

మన పత్రిక, క్రైం: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన వనమల లోకేశ్‌ (29) నగరంలోని గండిమైసమ్మ ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీలో పని చేసేవాడు. లోకేశ్ గత రెండేళ్లుగా సహచరితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ వివాహానికి ముందే నిర్ణయం తీసుకొని, పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేసుకున్నారు. శుక్రవారం లోకేశ్ ఓయో గదిని అద్దె తీసుకొని, … Read more

తిరుమలలో భక్తుల వెల్లువ.. సర్వదర్శనానికి 15 గంటలు

మన పత్రిక, తిరుమల తిరుపతి దేవస్థానం: పవిత్ర క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వరుస సెలవులు, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో శనివారం తెల్లవారుజామున నుంచే తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో బయట క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ … Read more

ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన పత్రిక: దేశంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటంతో పసిడి డిమాండ్ కొనసాగుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు శనివారం కొద్దిగా పెరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,350గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 … Read more

తెల్లవారుజామున గోదావరిఖనిలో ఘోన రోడ్డుప్రమాదం

మన పత్రిక, తెలంగాణ క్రైం: కరీంనరగ్ జిల్లాలోని గోదావరిఖనిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ సమీపంలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు అందరూ లోపలే ఇరుక్కుపోయారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారులో … Read more

ఈనెల 5న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం..?

మన పత్రిక, సినిమా: టాలీవుడ్‌లో మరో శుభవార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వివాహ వార్తలకు తాజాగా స్పష్టత వచ్చింది. ఈ నెల 5న తిరుమలలో ఆయన నిశ్చితార్థం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్థం అనంతరం ఈ నెల 29న హైదరాబాద్లో వివాహాన్ని … Read more

సర్కారు విద్యార్థులకు అదనపు సౌకర్యాలు.. షూస్‌, బెల్టులతో నూతన కిట్

మన పత్రిక, తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే విద్యా సంవత్సరంనుంచి విద్యార్థులకు అందించే సౌకర్యాలను మరింత విస్తరించనుంది. ఇప్పటికే యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్న ప్రభుత్వం, ఇకపై బ్లాక్ షూస్‌, బెల్టులు, సాక్స్‌లను కూడా అందించనుంది.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18.70 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ రెండు జతల సాక్స్‌, బ్లాక్ షూస్‌, బెల్టులు అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. అబ్బాయిలు, … Read more