నల్లగొండలో ఎస్పీ ‘మిడ్నైట్’ ఆపరేషన్.. రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక సోదాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ టౌన్, రూరల్ పరిధిలోని ముషంపల్లి గ్రామాల్లోని రౌడీషీటర్ల ఇళ్లను ఆయన స్వయంగా సందర్శించి వారి కదలికలపై ఆరా తీశారు.
ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్థులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని బైండోవర్ చేశామని, నిబంధనలు ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని వారికి సూచించారు.
ఈ తనిఖీల్లో ఎస్పీతో పాటు డిఎస్పి శివరాం రెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదా బాబు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీస్ పెట్రోలింగ్ మరింత ముమ్మరం కానుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
