అరుదైన ఘటన: గ్రామంలో ఉన్నది ఒక్కరే ఎస్సీ మహిళ.. సర్పంచ్ పీఠం ఆమెదే!
వరంగల్ జిల్లా (Warangal District) సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడి స్థానం ఎస్సీ (SC) మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో మొత్తం 1600 ఓట్లు ఉన్నప్పటికీ, అర్హులైన ఎస్సీ మహిళా ఓటరుగా ‘కొంగర మల్లమ్మ’ ఒక్కరే ఉండటం విశేషం. దీంతో ఆమెకు జాక్ పాట్ తగిలినట్లయింది.
పోటీకి మరెవరూ లేకపోవడంతో మల్లమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమైంది. గ్రామంలో ఒకే ఒక్క ఎస్సీ మహిళా ఓటరు ఉన్నారని ఎంపీడీవో రవీందర్ ధ్రువీకరించారు. కాగా, ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు వివిధ పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామస్థులంతా సహకరిస్తే ఊరిని అభివృద్ధి చేస్తానని మల్లమ్మ పేర్కొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
