నా కథను నాశనం చేశారు.. వరలక్ష్మి ‘సరస్వతి’ మూవీపై సాయి మాధవ్ ఫైర్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: స్టార్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) దర్శకురాలిగా పరిచయమైన ‘సరస్వతి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. తన కథను ఇష్టమొచ్చినట్లు మార్చేసి, దారుణంగా నాశనం చేశారని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బన్నీ వాసు, ఈటీవీ విన్ సపోర్ట్ తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి వాస్తవానికి ఆయనే దర్శకత్వం వహించాల్సి ఉంది. “సినిమా నా కథతో మొదలై … Read more

ఢిల్లీలో ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ, ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయ్యద్ ఖతీబ్‌జాదా భారత్ పర్యటన తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జరిగిన అయతుల్లా అలీ ఖమేనీ సంతాప సభకు, అలాగే ‘రైసీనా డైలాగ్‌’కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఖతీబ్‌జాదా మాట్లాడుతూ.. ఇరాన్ కొత్త నాయకత్వాన్ని తామే నిర్ణయిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో … Read more

ఎక్కడో క్షిపణుల మోత.. ఇక్కడ వంటింట్లో మంట.. సామాన్యుడిపై వార్ ఎఫెక్ట్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల్లో జరుగుతున్న యుద్ధం సెగ మన సామాన్యుడి వంటింటికి చేరింది. అక్కడ రవాణా నిలిచిపోవడంతో.. మన దేశ ఆర్థిక వ్యవస్థపై, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడబోతోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు, అరటిపండ్లు, ఉల్లి, కూరగాయల షిప్‌లు నిలిచిపోవడంతో.. స్థానికంగా సరఫరా పెరిగి తాత్కాలికంగా వాటి ధరలు పడిపోనున్నాయి. ఉదాహరణకు ₹7 ఉన్న గుడ్డు రేటు ₹5 కి రానుంది. అయితే ఇది నాణేనికి ఒకవైపే! … Read more

డీజే టిల్లు’ ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇంట విషాదం.

మన పత్రిక వెబ్​డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు, ‘బలగం’, ‘డీజే టిల్లు’ సినిమాల ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి శశికళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. విద్యుత్ శాఖలో ఉద్యోగ విరమణ అనంతరం 2018లో సినిమాల్లోకి ప్రవేశించిన మురళీధర్ కు ఆయన భార్య ఎంతో అండగా నిలిచారు. శశికళ గతంలో రామాయంపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌గా కూడా ప్రజాసేవ చేశారు. వరుస సినిమాలతో … Read more

విజయవాడలో అమానుషం.. ప్లే స్కూల్ చిన్నారిపై ఘోరమైన యాసిడ్ దాడి!

మన పత్రిక వెబ్​డెస్క్ : విజయవాడలోని విద్యాధరపురం ‘నేషనల్ ప్లే స్కూల్‌’లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదారేళ్ల వయసున్న ఓ పసిపాప ప్రైవేట్ పార్ట్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది. చిన్నారి బాత్రూమ్‌లో జారిపడిందని స్కూల్ యాజమాన్యం కట్టుకథ అల్లి తల్లిదండ్రులకు చెప్పి ఆస్పత్రిలో చేర్పించింది. తీరా చూస్తే అవి యాసిడ్ గాయాలని నిర్ధారణ అయ్యింది. పరువు పోతుందనే నెపంతో ఆస్పత్రి బిల్లులు కట్టి … Read more

ఐపీఓ ముంగిట ఫ్లిప్‌కార్ట్ సంచలనం.. వందలాది ఉద్యోగులపై వేటు!

మన పత్రిక వెబ్​డెస్క్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. వార్షిక పనితీరు (పెర్ఫార్మెన్స్) సమీక్షల ఆధారంగా సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో తొలి పబ్లిక్ ఇష్యూ (IPO) కు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న సంస్థ.. ఒకవైపు వివిధ విభాగాల్లో సీనియర్ స్థాయి అధికారులను (వైస్ ప్రెసిడెంట్లను) కొత్తగా నియమించుకుంటూనే, మరోవైపు ఈ … Read more

మాదిగల కోసం కర్ణుడిలా నిలబడ్డా.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అమలుపై మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో మిత్రుడి కోసం నిలబడిన కర్ణుడు, బలహీనుల పక్షాన పోరాడిన బర్బరీకుడి పాత్రలను గుర్తుచేస్తూ.. న్యాయం వాళ్ల వైపు ఉన్నందునే తాను మాదిగల వెంట నిలబడినట్లు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను ప్రకటించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని సీఎం గుర్తుచేశారు. … Read more

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర వాసులకు జలమండలి (HMWSSB) కీలక అలర్ట్ జారీ చేసింది. మంజీరా ఫేజ్-3 ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌస్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని ప్రకటించింది. గత 35 ఏళ్లుగా వినియోగిస్తున్న పాత ఎలక్ట్రికల్ ప్యానెల్స్ స్థానంలో అత్యాధునిక ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం, 2000 ఎంఎం భారీ … Read more

ఏపీలో బాలికలకు ఉచిత విద్య.. కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం!

మన పత్రిక వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు ఇతర తరగతుల్లో (7 నుంచి 10) మిగిలిన సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు అర్హులైన బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు, అనాథలు, బడి మానేసిన డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, … Read more

ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ సంచలన పోస్ట్.. అసలు ప్లాన్ ఇదే!

మన పత్రిక వెబ్​డెస్క్, వాషింగ్టన్: ఇరాన్‌తో ఇకపై ఎలాంటి ఒప్పందాలు ఉండవని, ఆ దేశం బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా ఆయన ఓ కీలక పోస్టు పెట్టారు. ఇరాన్ లొంగిపోయిన తర్వాతే అక్కడ అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త నాయకుడి ఎన్నిక ఉంటుందని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌ను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటకు తీసుకొస్తామని, … Read more