మన పత్రిక వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు, ‘బలగం’, ‘డీజే టిల్లు’ సినిమాల ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి శశికళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
విద్యుత్ శాఖలో ఉద్యోగ విరమణ అనంతరం 2018లో సినిమాల్లోకి ప్రవేశించిన మురళీధర్ కు ఆయన భార్య ఎంతో అండగా నిలిచారు. శశికళ గతంలో రామాయంపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌గా కూడా ప్రజాసేవ చేశారు. వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమయంలో, జీవిత భాగస్వామి దూరం కావడం మురళీధర్ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది.
Advertisement
ఈ హఠాన్మరణ వార్త తెలుసుకున్న సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
