మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర వాసులకు జలమండలి (HMWSSB) కీలక అలర్ట్ జారీ చేసింది. మంజీరా ఫేజ్-3 ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌస్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని ప్రకటించింది.
గత 35 ఏళ్లుగా వినియోగిస్తున్న పాత ఎలక్ట్రికల్ ప్యానెల్స్ స్థానంలో అత్యాధునిక ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం, 2000 ఎంఎం భారీ పైప్‌లైన్లకు సంబంధించిన ఎయిర్ వాల్వ్‌లు, వెంట్లను పూర్తిగా ఆధునికీకరిస్తున్నారు.
ఈ పనుల వల్ల భవిష్యత్తులో పంపింగ్ వ్యవస్థ సామర్థ్యం పెరిగి, తాగునీటి సరఫరాలో సాంకేతిక సమస్యలకు శాశ్వత చెక్ పడనుంది. అయితే, తాత్కాలికంగా ఎదురయ్యే ఈ రెండు రోజుల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ముందుగానే తగిన నిల్వలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ మరమ్మతులు పూర్తయిన వెంటనే యథావిధిగా సరఫరా పునరుద్ధరించనున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
