మన పత్రిక వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తో పాటు ఇతర తరగతుల్లో (7 నుంచి 10) మిగిలిన సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మార్చి 12 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు అర్హులైన బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు, అనాథలు, బడి మానేసిన డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద బాలికలు దరఖాస్తుకు అర్హులు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం రిజర్వేషన్లు, విద్యార్హతల ఆధారంగానే అడ్మిషన్లు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 కేజీబీవీల్లో ఎంపికైన విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యతో పాటు భోజన, వసతి సదుపాయాలు లభిస్తాయి. పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు పైచదువులు చదువుకోవడానికి ఈ అవకాశం ఎంతో ఆసరాగా నిలవనుంది.
అర్హులైన విద్యార్థినులు గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
