రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా?: వైసీపీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వైసీపీ డ్రామా ఆడుతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల ఖర్చులపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

కడపలో రూ.3,100 కోట్ల పెట్టుబడితో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ: రేపు లోకేశ్ శంకుస్థాపన

కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

జగన్ శవ రాజకీయాలు మానాలి: విశాఖ పర్యటనపై పల్లా శ్రీనివాస్ విమర్శలు

వైసీపీ హయాంలో మత్స్యకారులను విస్మరించిన జగన్, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం విశాఖకు వస్తున్నారని పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు.

పల్నాడు జిల్లాలో విషాదం: ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠరాజుపల్లి గ్రామంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. పిల్లలను చంపిన తర్వాతే తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు నిర్ణయించిన సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

ముంబైలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కల్యాణ్‌ను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి పరామర్శించారు.

పలాస ప్రమాద కేసు: పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మంత్రి కుమారుడు

పలాసలో జరిగిన బైక్ ప్రమాద కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ కాశీబుగ్గ పోలీసుల ఎదుట లొంగిపోయారు.