Advertisement

పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు నిర్ణయించిన సీఎం చంద్రబాబు

మన పత్రిక, పోలవరం: పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2027 మార్చి నాటికి ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన అనంతరం అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని పనులు నిలిచిపోయాయని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 89 శాతం మేర పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీ నాటికి విశాఖపట్నానికి గోదావరి జలాలను అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎటువంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement