ఎన్నికల సిబ్బందికి గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన రెమ్యూనరేషన్!

telangana polling staff remuneration hike 2025 panchayat elections

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలింగ్ సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్‌ (REMUNERATION FOR POLLING PERSONALS IN TELANGANA 2025) ను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఈ పెరిగిన చెల్లింపులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి టి.ఏ (TA), డి.ఏ (DA) మరియు ఇతర … Read more

TG News: తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం

Telangana Rising Global Summit 2025

తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం: సీఎం రేవంత్ రెడ్డి మన పత్రిక, వెబ్​డెస్క్: మీర్‌ఖాన్‌పేట్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) తొలిరోజు ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. … Read more

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అమెరికా విమానాలే టార్గెట్.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్! మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామని, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో వాటిని పేల్చేస్తామంటూ ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే వెంటనే మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని అన్ని … Read more

హైదరాబాద్ భవిష్యత్తుకు కొత్త చిరునామా… Telangana Future city

telangana vision

మన పత్రిక, వెబ్​డెస్క్: దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలకు అనుబంధంగా శాటిలైట్ నగరాలు అభివృద్ధి చెందినట్లే, హైదరాబాద్‌కు ‘ఫ్యూచర్ సిటీ’ అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లతో విస్తరించిన హైదరాబాద్‌కు పెరుగుతున్న జనాభా, వలసల కారణంగా మరో కొత్త నగరం అవసరం ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి రేవంత్ రెడ్డి ఈ బృహత్తర ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. దేశ … Read more

తీవ్ర సంక్షోభంలో తెలంగాణ వర్సిటీలు.. పాలకులు మారుతున్నా తీరని వెతలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధుల లేమి, అధ్యాపకుల కొరతతో సతమతమవుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (Osmania University) ఆగస్టు 25న రెండు వసతి గృహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పటికీ, అక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలు మాత్రం ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజున వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేవలం ఓయూపైనే కాకుండా మిగిలిన వర్సిటీలపైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం … Read more

Teachers: టీచర్లకు సమానం సీనియారిటీ

NOTIONAL SERVICE FOR MODEL SCHOOL TEACHERS.

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ‘నోషనల్ సర్వీస్’ (Notional Service) అంశాన్ని పరిష్కరిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే నోటిఫికేషన్ అయినప్పటికీ, నియామకాలు రెండు విడతలుగా (2013, 2014) జరగడంతో రెండో దశలో చేరిన వారు సర్వీస్ పరంగా నష్టపోయారు. తాజా నిర్ణయంతో 2014లో విధుల్లో చేరిన వారికి కూడా 2013 బ్యాచ్‌తో సమానంగా సీనియారిటీ, వేతనాలు లభించనున్నాయి. ఉద్యోగ సంఘాల … Read more

Nalgonda: నల్లగొండలో రౌడీషీటర్లకు గట్టి వార్నింగ్.

Nalgonda

నల్లగొండలో ఎస్పీ ‘మిడ్‌నైట్’ ఆపరేషన్.. రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక సోదాలు గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ టౌన్, రూరల్ పరిధిలోని ముషంపల్లి గ్రామాల్లోని రౌడీషీటర్ల ఇళ్లను ఆయన స్వయంగా సందర్శించి వారి కదలికలపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్థులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ స్పష్టం … Read more

Fraud Company : ప్రజల నుంచి 330 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన కంపెనీ

company collected 330 crores and cheated in Nalgonda dist

Fraud Company : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 330 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన ఓ కంపెనీ తాజాగా బోర్డు తిప్పేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి ఇస్తామని ఆశ చూపించిన ఓ కంపెనీ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా రూ.330 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందని.. … Read more

Komatreddy : సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే

komatreddy demands apology from pawan kalyan

Komatreddy : ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు.. అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల నరదిష్టి వల్లనే కోనసీమ అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించారు. ఆయన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి … Read more

Street Dogs Attack : హయత్‌నగర్‌లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి

street dogs attack child in hayathnagar

Street Dogs Attack : హైదరాబాద్ లోని హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. శివగంగ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు కలిసి ఒకేసారి దాడి చేశాయి. దీంతో ఆ బాలుడి చెవి ఊడిపోయింది. సమయానికి స్పందించిన కాలనీ వాసులు ఆ బాలుడిని వీధి కుక్కల బారి నుంచి కాపాడి … Read more