Street Dogs Attack : హైదరాబాద్ లోని హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. శివగంగ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు కలిసి ఒకేసారి దాడి చేశాయి. దీంతో ఆ బాలుడి చెవి ఊడిపోయింది. సమయానికి స్పందించిన కాలనీ వాసులు ఆ బాలుడిని వీధి కుక్కల బారి నుంచి కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన సమీపంలోని ఓ ఇంటి సీసీటీవీ కెమెరాలో దాడి రికార్డు కావడంతో ఆ వీడియోను చూసి అయినా జీహెచ్ఎంసీ అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని.. వీధి కుక్కల బారి నుంచి నగర ప్రజలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
