700 కోట్లు జమ – తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు శుభవార్త

700 crores for Employees pending bills clearance

Telangana News: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సెప్టెంబర్ నెలకు గానూ 700 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల సంఘాల నాయకులకు ఈ విషయం అధికారికంగా తెలిపారు. రెండు రోజుల్లోనే ఈ మొత్తం జమ చేస్తారని సమాచారం. సరెండర్, TSGLI, GPF బిల్లులు కూడా ఈ దశలో విడుదల అవుతాయనే ఆశ ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించింది. పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

తెలంగాణలో ఎన్నికల కోడ్ – బదిలీలు, పదోన్నతులపై నిషేధం

Telangana election code ban on transfers and promotions

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కోడ్ ప్రకారం, ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అధికారులందరికీ బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులపై పూర్తి నిషేధం. ఎన్నికలు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తారు. 31 జిల్లాల్లో శాంతిభద్రతలు, సన్నాహాలను సమీక్షించిన ఎన్నికల సంఘం, పోలింగ్ శాంతియుతంగా జరగాలని సూచించింది. ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులని … Read more

Guinness Record: సరూర్‌నగర్‌లో 1354 మంది మహిళలతో మెగా బతుకమ్మ

hyderabad bathukamma Guinness Record

Saroornagar bathukamma Guinness Record: సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన మెగా బతుకమ్మ గ్రాండ్ ఈవెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. రెండు రికార్డులు — ఒకటి: 11 అడుగుల వెడల్పు, 68 అడుగుల ఎత్తు, 7 వేల టన్నుల పూలతో ఏర్పాటు చేసిన అతిపెద్ద బతుకమ్మ. రెండోది: ఒకేసారి 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ నర్తించడం. ఈ ఘన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ … Read more

Bathukamma: తెలంగాణ మహిళల ఘన సంబరాలు

Bathukamma Celebrations 2025

చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ మహిళలు ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు ( Bathukamma Celebrations ) చేసుకుంటున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ కలిసి నృత్యం చేస్తున్నారు. హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో కూడా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతున్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపడే ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా … Read more

నంద్యాలలో ఏసీబీ షాక్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు

NANDYAL ACB CASE

మన పత్రిక, వెబ్​డెస్క్: నంద్యాల జిల్లా ( Nandyal District ) ఆళ్లగడ్డలో ( Allagadda ) రోడ్లు భవనాల శాఖ ( Roads and Buildings Department ) అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి ఆప్టిక్ ఫైబర్ వర్క్ కోసం 55 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు ఇచ్చాడు. మిగిలిన 15 వేల కోసం దస్తగిరి ( … Read more

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలు

telangana panchayat elections code

Telangana Election Code: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కోడ్ నవంబర్ 11 వరకు అమలులో ఉంటుంది. ఆ రోజు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఫలితాలు వెల్లడి కానున్నాయి. గ్రామపంచాయతీలకు మూడు దశల్లో, ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ తేదీలు: ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు అక్టోబర్ 23, 27; గ్రామపంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, … Read more

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Telangana PANCHAYATI ELECTIONS SCHEDULE

telangana panchayat election schedule : పంచాయతీ ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో జరుగుతాయి. మూడు దశల్లో గ్రామ పంచాయతీల ఓటింగ్ ఉంటుంది. ప్రతి దశ 15 రోజుల్లో పూర్తి కానుంది. షెడ్యూల్ విడుదలతో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. MPTC, ZPTC ఎన్నికల కోసం రెండు దశలు నిర్ణయించారు. మొదటి దశలో అక్టోబర్ 9న నామినేషన్లు, అక్టోబర్ 23న పోలింగ్. రెండో దశలో అక్టోబర్ 13న నామినేషన్లు, అక్టోబర్ … Read more

Nirmal: పొగమంచు వాహనదారులకు ఇబ్బందులు

NIirmal weather news today

Nirmal News: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, తర్లపాడు, ఎల్లాపూర్ సహా పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పొగమంచు కమ్మేసింది. దృశ్యం అస్పష్టంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో డ్రైవర్లు నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లారు. పొగమంచు కొంతసేపటికి తగ్గినా, ఉదయం రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు హెడ్లైట్లు, ఫోగ్ లైట్లు వాడాలని అధికారులు సూచించారు.

Saddula Bathukamma – తెలంగాణ పండుగ ముగింపు ఘనం

saddula bathukamma 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణలో బతుకమ్మ సంబురాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన వేడుకలు నేడు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఈ రోజు పెద్ద పెద్ద బతుకమ్మలు, పసుపు గౌరమ్మ, ఐదు రకాల నైవేద్యాలతో విశేషంగా జరుపుకుంటారు. రాగి పల్లెంలో కుంకుమ, పసుపు, గునుగు, బంతిపూలు లాంటి రంగులతో త్రికోణంగా అలంకరిస్తారు. కొందరు నిలువెత్తు బతుకమ్మలు, కాగితాలతో కూడా తయారు చేస్తారు. సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు … Read more

బతుకమ్మ కుంట చెరువు ప్రారంభం – సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad bathukamma kunta

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ కుంట ( bathukamma kunta ) చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ చెరువు గత కొన్నేళ్లుగా కబ్జాలో ఉండేది. హైదరాబాద్ నగరంలో స్వాధీనం చేసుకుని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అసలు 26న ప్రారంభించాల్సిన పని భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది.